6న 'వీడు చాలా వరస్ట్'
Send us your feedback to audioarticles@vaarta.com
View Veedu Chala Worst Gallery |
నందమూరి తారకరత్న యమధర్మరాజుగా నటించిన సోషియో ఫాంటసీ చిత్రం వీడు చాలా వరస్ట్. నందన్, నీరజ్ కృష్ణ, స్వప్న ప్రధాన తారాగణం. వెంకట్ పంపన దర్శకుడు. ఎస్.ఎల్.ఎస్ ఫిలింస్ పతాకంపై పి.ఎన్.ఎస్ గౌడ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా..
దర్శకుడు వెంకట్ పంపన మాట్లాడుతూ ఇదొక విభిన్న తరహా సోషియో ఫాంటసీ చిత్రం. మనిషి అంతర్ముఖాన్ని ఆవిష్కరించే సినిమా. ఇందులో 28 నిమిషాల పాటు గ్రాఫిక్స్ ఉంటాయి. యమధర్మరాజుపై తీసిన పాటే సినిమాకి హైలైట్ అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ యమధర్మరాజు పాత్రలో తారకరత్న అద్భుతంగా నటించారు. ఇప్పటి వరకు తెలుగు తెరపై రానీ కథాంశం అని చెప్పారు.
భానుచందర్, జయప్రకాష్ రెడ్డి, కృష్ణభగవాన్, రఘు, రాజీవ్ కనకాల, అజయ్, ప్రభాస్ శ్రీను, సంగీత, భావన, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: పార్థసారథి, కెమెరా: ఈశ్వర్, నిర్మాత: నరేష్ గౌడ్, కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: వెంకట్ పంపన.
Watch Veedu Chala Worest Trailers
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com