'బచ్చన్ 'ప్లాటినమ్ డిస్క్
Send us your feedback to audioarticles@vaarta.com
View Bachchan Platinum Disc Gallery |
భీమవరం టాకీస్ బ్యానర్ పై ప్రస్తుతం రానున్న సినిమా 'బచ్చన్'. జగపతిబాబు, సుదీప్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాని తెలుగులో తుమ్మలపల్లి రామసత్యనారాయణ విడుదల చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాని 17న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఆడియో మంచి టాక్ సంపాదించుకుంది. ఈ సినిమా ప్లాటినం వేడుకను హైదరాబాద్ లో జరిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బసవరాజు, సారయ్య, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, తెలంగాణా ఫిలిమ్ ఛాంబర్ ప్రెసిడెంట్ అంబరీష్, శివనాగేశ్వరరావు, సునీల్ కుమార్ రెడ్డి, సాయివెంకట్, శక్తి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ...
నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ 'కన్నడలో విజయం సాధించిన ఈసినిమాని తెలుగులో బచ్చన్ పేరుతో విడుదల చేస్తున్నాం. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత రోజు అంటే 17న విడుదల చేస్తున్నాం. ఈ సినిమాకి పాటలు, ఫైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి' అన్నారు. వి.హరికృష్ణ సంగీతం అందించిన ఈ సినిమా శశాంక్ డైరెక్షన్ లో తెరకెక్కింది.
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com