'ఉలవచారు బిర్యాని' ప్రెస్ మీట్
Send us your feedback to audioarticles@vaarta.com
క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో కె.యస్.రామారావు సమర్పణలో ప్రకాష్ రాజ్ బ్యానర్ లో వల్లభ నిర్మిస్తున్న సినిమా ఉలవచారు బిర్యాని. ప్రస్తుతం రీరికార్డింగ్ దశలోని ఈ సినిమాని మే మధ్యలో విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో...
కె.యస్.రామారావు మాట్లాడుతూ 'మలయాళంలో సినిమా నచ్చగానే నేను, ప్రకాష్ రాజ్ తెలుగు, తమిళం, కన్నడలో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం. తేజస్ డైరెక్టర్ తేజ దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశాడు. తన టాలెంట్ నచ్చడంతో ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో తనకి అవకాశం ఇచ్చాడు. తేజస్ వాళ్ల నాన్న నాకు మంచి మిత్రుడు. నా బ్యానర్ లో తనని పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. లవ్ స్టోరీలకు మరో మంచి హీరో దొరికాడు. భవిష్యత్ లో మంచి హీరోగా ఎదుగుతాడు' అన్నారు.
హీరో తేజస్ మాట్లాడుతూ 'కె.యస్.రామారావుగారి కారణంగానే నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. ఆయన బ్యానర్ లో కనీసం ఒక సినిమా అయినా చేద్దామనుకున్నాను. కానీ నా తొలి సినిమాయే ఆయన బ్యానర్ లో చేయడం ఆనందంగా ఉంది. ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో, ఇళయరాజా సంగీత సారథ్యంలో నేను పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో నవీన్ అనే కాలేజీ కుర్రాడి పాత్రలో నటిస్తున్నాను. ప్రకాష్ రాజ్ గారి ప్రేమకి సహాయపడే పాత్ర. కె.యస్.రామారావుగారి గైడెన్స్ ను మరిచిపోలేను. రొమాంటిక్ కామెడీ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా అందరికి నచ్చుతుంది' అని తెలిపారు
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com