11న 'రేసుగుర్రం'
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, శృతిహాసన్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కతున్న సినిమా రేసుగుర్రం. నల్లమలుపు శ్రీనివాస్, డా.కె.వెంకటేశ్వరరావు నిర్మాతలు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
థమన్ సంగీతానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఊహించిన విధంగానే అల్లుఅర్జున్, శృతిహాసన్, సురేందర్ రెడ్డిల క్రేజీ కాంభినేషన్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.బిజెనెస్ కూడా మంచి ఫ్యాన్సీ రేటుతో జరుగుతుందని సమాచారం. ఈ సినిమా బిజెనెస్ పరంగా వస్తున్న ఆఫర్స్ తో నిర్మాతల్లో ఒకరైన నల్లమలుపు బుజ్జి చాలా సంతృప్తిగా ఉన్నాడని సమాచారం.
ఈ సినిమాని వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట.పోలీస్ ఆఫీసర్ పాత్రలో బన్ని కనిపించనున్నాడు. ఈ రేసుగుర్రాని ఏప్రిల్ 11న బరిలోకి నిలపాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.మరి ఈ రేసుగుర్రంలో ఏ రేంజ్ పరిగెత్తి గెలిచి నిలుస్తోందో తెలుసుకోవాలంటే వచ్చే నెల 11 వరకు ఆగాల్సిందే.
Watch 'Race Gurram' Trailers
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com