'బసంతి' ఆడియో సక్సెస్ మీట్
Send us your feedback to audioarticles@vaarta.com
బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ , ఆలీషా బేగ్ హీరోహీరోయిన్లుగా స్టార్ట్ కెమెరా పిక్చర్స్ బ్యానర్ లో 'బాణం' ఫేమ్ చైతన్య దంతలూరి దర్శక నిర్మాణంతో తెరకెక్కుతున్న సినిమా 'బసంతి'. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఇటీవల విడుదలై మంచి టాక్ తో హిట్టయ్యింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఆడియో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో ప్రముఖ దర్శకుడు పూరిజగన్నాథ్, దిల్ రాజు, మధురశ్రీధర్, మంచు మనోజ్ లతో పాటు చిత్ర యూనిట్ కూడా పాల్గొంది.
ఈ సందర్బంగా...పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ''బ్రహ్మానందంగారు ఎంత పేరు తెచ్చుకున్నారో మనందరికి తెలిసిందే. హీరోగా గౌతమ్ కూడా మంచిపేరు తెచ్చుకోవాలి. పాటలు, ప్రోమోలు బావున్నాయి. సినిమా సక్సెస్ కావాలి'' అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ ''మా బ్యానర్ లో చైతన్య రెండు, మూడు సినిమాలకు పనిచేశాడు. నాకు సినిమా లైన్ తెలుసు. ప్రేమతో పాటు కొత్త పాయింట్ ను తెరకెక్కించారు, ట్రైలర్స్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకనిర్మాతకి మంచిపేరుతోపాటు, లాభాలు కూడా రావాలని కోరుకుంటున్నాను'' అని తెలిపారు.
దర్శకనిర్మాత చైతన్య దంతలూరి మాట్లాడుతూ ''బాణం చిత్రం నాకు మంచి పేరుని తీసుకొచ్చింది. ఈ సినిమాతో ఇంకా మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను. చక్కని కథాంశంతో రూపొందిన చిత్రమిది. మణిశర్మగారి సంగీతం సినిమాకి ప్లస్ అవుతుంది. పాటలు హిట్టయ్యాయి. సినిమా ఇంకా పెద్ద హిట్టవ్వాలి'' అని తెలిపారు.
మంచు మనోజ్ మాట్లాడుతూ ''బాణంతో చైతన్య తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఈ సినిమాతో గౌతమ్ తనెంటో నిĸ
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com