21న వస్తున్న'మనుషులతో జాగ్రత్త'
Send us your feedback to audioarticles@vaarta.com
డా.రాజేంద్రప్రసాద్, సీనియర్ నరేష్ ప్రధానపాత్రధారులుగా, అక్షయ్ తేజ్, విదర్శ నటీనటులుగా చేస్తున్న సినిమా 'మనుషులతో జాగ్రత్త'. వసుంధర అకాడమీ బ్యానర్ లో సినిమా తెరకెక్కుతుంది. బి.చిరంజీవులు నాయుడు నిర్మాత. గోవింద్ వరహా దర్శకుడు. ప్రణవ్ సంగీత దర్శకుడు. అయితే ఈ సినిమాని ఈ నెల 21న విడుదల చేయాలనుకుంటున్నట్టు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుందట.
ఈ సందర్భంగా. నిర్మాత బి.చిరంజీవులు నాయుడు మాట్లాడుతూ 'దర్శకుడు అనుకున్నట్టు సినిమాని తెరకెక్కించాడు. సినిమా బాగా వచ్చింది. ఆడియోకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది. ఈ సినిమాని ఈ నెల 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు.
దర్శకుడు మాట్లాడుతూ 'నేడు మన చుట్టూ ఏం జరుగుతుందో అదే అంశాలతో సినిమాని తెరకెక్కించాను. ఏవరి కోసమో నేనీ సినిమా తీయలేదు. కామెడీ, సెంటిమెంట్ అన్నీ అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి' అని అన్నారు.
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com