ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని, డిప్యూటీగా రఘుపతి!

  • IndiaGlitz, [Friday,June 07 2019]

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా సీనియర్ నేత, ఆముదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారం పేరు దాదాపు ఖరారు అయిపోయింది. ఇక అధికారికంగా ప్రకటన మాత్రమే ఆలస్యమైంది. ఇవాళ సాయంత్రంలోపు అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశముంది. ఇక డిప్యూటీ స్పీకర్ విషయానికొస్తే.. సీనియర్ నేత కోన రఘుపతి పేరు దాదాపు ఖరారైంది.. అయితే రఘుపతికి ఇవ్వాలా..? లేదా మల్లాది విష్ణుకు ఇవ్వాలా..? అనేదానిపై అధిష్టానం కాస్త ఆలోచనలో పడింది.

కాగా.. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ సీటులో ఎవరు కూర్చుంటారా..? అనేదానిపై గత కొన్నిరోజులుగా వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం విదితమే. అయితే అనుమానాలన్నింటిని పటాపంచ్‌లు చేస్తూ స్పీకర్ ఎవరో వైసీపీ తేల్చేసింది. శుక్రవారం మధ్యాహ్నమే స్పీకర్ ఎవరో తేలినప్పటికీ ఇంతవరకూ అధికారికంగా ప్రకటన రాలేదు. ఇప్పటికే మంత్రి వర్గ ఏర్పాటులో కీలక నిర్ణయాలు తీసుకున్న వైఎస్ జగన్.. స్పీకర్‌ విషయంలో కూడా ఆచితూచి అడుగులేశారని చెప్పుకోవచ్చు.

ఒకట్రెండు కాదు.. ఏకంగా ఆరుసార్లు!

ఆముదాలవలస నుంచి 1983లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సీతారాం.. అప్పట్నుంచి ఇప్పటి వరకూ మొత్తం ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985లో ప్రభుత్వ విప్‌గా, 1994లో చంద్రబాబు కేబినెట్‌లో మున్సిపల్‌ శాఖ మంత్రిగా సీతారాం సేవలందించి తనదైన ముద్రవేసుకున్నారు. అంతేకాదు.. తన బంధువు అయిన కూన రవికుమార్‌పై పోటీగా నిలబడిర తమ్మినేని సీతారాం 13,856 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

నేరుగా జగన్‌ దగ్గరికి!

శుక్రవారం రోజున వైసీపీఎల్పీ సమావేశం అనంతరం తమ్మినేని సీతారం నేరుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో భేటీకావడం.. అప్పటికే ఆయనే స్పీకర్‌ అని వచ్చిన వార్తలకు మరింత బలాన్ని చేకూర్చినట్లైంది. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట వేయాలన్న జగన్.. బీసీ (కళింగ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని స్పీకర్‌గా నియమించడం విశేషమని చెప్పుకోవచ్చు.

సౌమ్యుడు, విద్యావంతుడు!

కోన రఘుపతి విషయానికొస్తే.. ఉన్నత విద్యా వంతుడు కావడం, వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం సౌమ్యుడిగా గుర్తింపుతో పాటు అసెంబ్లీ వ్యవహారాలపై మంచి పరిజ్ఞానం నేపథ్యంలో కోన రఘుపతి వైపు వైసీపీ పెద్దలు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అయితే మొదట ఈయన్ను స్పీకర్‌గా నియమించాలని భావించినప్పటికీ.. ఫైనల్‌గా డిప్యూటీ స్పీకర్‌గా నియమించారు. కాగా మరికొన్ని గంటల్లోనే ఈ మొత్తం వ్యవహారాలపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

More News

'సాక్షి' నుంచి ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కృష్ణమోహన్!

సీనియర్ జర్నలిస్ట్, జర్మలిజంలో సత్తా చాటి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జీవీడీ కృష్ణ మోహన్‌ను కీలక పదవి వరించింది.

త్వరలో ఫలక్ నుమా దాస్-2 తో షాక్ ఇస్తాం..

వన్మయి క్రియేషన్స్ పతాకంపై కరాటే రాజు సమర్పణలో విశ్వక్ సేన్ సినిమాస్ మరియు టెర్రమర పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన  చిత్రం 'ఫలక్ నుమా దాస్'.

మోసం చేశాడని మంత్రి పదవి ఇవ్వని వైఎస్ జగన్!?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎవరెవరికి మంత్రి పదవులు వరించబోతున్నాయ్..? రేపు ఎవరెవరు మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు..? ఇప్పటి వరకూ ఇన్ని మంత్రి వర్గ ఏర్పాటులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇచ్చి

'ప్రేమ‌జంట‌' సెన్సార్ పూర్తి.. జూన్ 28న గ్రాండ్ రిలీజ్‌

సన్ వుడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ ప్రణీత్, సుమయ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `ప్రేమ‌జంట‌`.

సాగర్ మంచి హీరోగా ఎదగాలి : వి.వి.వినాయక్

సమరం చాలా పెద్ద హిట్ అయి సాగర్ ఇండస్ట్రీలో మంచి హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాను... సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్