'మసాలా' డేట్ కన్ ఫర్మ్..
Send us your feedback to audioarticles@vaarta.com
సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లిమెటెడ్, స్రవంతి మూవీస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'మసాలా'. వెంకటేష్, రామ్, అంజలి, షాజన్ పదంసీ హీరోహీరోయిన్లు. డి.సురేష్ బాబు, స్రవంతి రవికిషోర్ లు నిర్మాతలు. విజయ్ భాస్కర్.కె దర్శకుడు. హిందీ చిత్రం 'బోల్ బచ్చన్'కి ఈ సినిమా రీమేక్ అన్న సంగతి అందరకీ విదితమే. దసరాకి ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. థమన్ సంగీత దర్శకుడు.
దీపావళి నాటికి విడుదల చేద్దామనుకున్న ఈ సినిమాని నవంబర్ 8న విడుదల చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతం ఈ చిత్రాన్ని నవంబర్ 14న పిల్లల దినోత్సవం నాడు విడుదల చేస్తున్నారు. కామెడీ ఎంటర్ టైనర్ చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించే విజయ్ భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకుల ఆదరణ పొందాలని ఆశిస్తాం.
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com