'విక్రమసింహా' రిలీజ్ డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
ఎరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో రజనీకాంత్ హీరోగా 'కొచ్చడయాన్'(తెలుగులో విక్రమసింహా) ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రజనీ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొనే నటిస్తుంది. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం కోసం సినీ పరిశ్రమంతా ఎదురు చూస్తుంది. మోషన్ క్యాప్ట్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఈ సినిమాని రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ తెరకెక్కిస్తున్నారు.
ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడో, అప్పుడో విడుదల అంటూ ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో విడుదలకు సంబంధించి చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయించింది.రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని 12.12.2013 నాటికి విడుదల చేస్తారట.. అలాగే అక్టోబర్ 7న ఈ సినిమాకి సంబంధించిన సింగిల్ ట్రాక్ ని సైతం విడుదల చేస్తారు. ఈ పాటను బాలసుబ్రమణ్యం పాడారు. రహమాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com