'దుర్గ'గా రానున్న నాగచైతన్య
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీ శుభ శ్వేత ఫిలిమ్స్ బ్యానర్ లో అక్కినేని నాగచైతన్య, హన్సిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్నరూపొందుతున్న సినిమా దుర్గ.ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ సమర్పణ. వరుణ్ కుమార్, శ్వేత లానా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం ఈ రోజు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది.ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు క్లాప్ నివ్వగా, కె.రఘురామ కృష్ణరాజు స్విచ్ఛాన్ చేయగా, వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం.
సి.కల్యాణ్ మాట్లాడుతూ' మా పిల్లల పేర్ల మీద ఈ సినిమాని నిర్మించడం జరుగుతుంది. ఎంటర్ టైన్ మెంట్ తో పాటు, మాస్ ఎలిమెంట్స్ ఉన్న కథాంశం. నాగార్జున గారికి శివ ల్యాండ్ మార్కుగా ఎలాంటి పేరు తీసుకొచ్చిందో దుర్గ నాగచైతన్యకి అంతే పేరు తీసుకొస్తుంది. సినిమా నాలుగు నెలల ముందే ప్రారంభం కావాల్సింది. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ నెల 24 నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. జూలై వరకు కంటిన్యూ షెడ్యూల్ ఉంటుంది.రంజాన్ కి విడుదల చేయాలనుకుంటున్నాం ఇందులో మొత్తం ఐదు పాటలుంటాయి. అక్కినేని అభిమానలు అంచనాలకు తగిన విధంగా సినిమా ఉంటుంది' అన్నారు
చిత్ర దర్శకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ' కామెడీ పాటు మాస్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతుంది. నాగచైతన్య లుక్స్ , క్యారెక్టర్ డిఫెరెంట్ గా ఉంటుంది. హన్సిక గ్లామర్, ఫెర్ఫామెన్స్ ఉన్న పాత్ర చేస్తుంది. నా కెరీర్ లో మాస్ సినిమా తీయలేదు. ఈ సినిమాతో ఆ కొరత తీరుతుంది అన్నారు.
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com