Tamannah: త్వరలో ‘MCA’ విలన్‌తో హీరోయిన్ తమన్నా పెళ్లి..?
Send us your feedback to audioarticles@vaarta.com
మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లోనూ హీరోయిన్గా ఓ క్రేజ్ తెచ్చుకుంది. సీనియర్ హీరోలతో పాటు కుర్ర హీరోల సరసన నటించి ఆకట్టుకుంది. ముఖ్యంగా హీరోలతో సమానంగా డ్యాన్స్ వేసి శభాష్ అనిపించుకుంది. కొంతకాంలగా తమన్నా లవ్ మ్యాటర్ హాట్ టాపిక్‌గా మారింది. హిందీ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు ఇటీవల తెలిపింది. నాని హీరోగా నటించిన ‘MCA’ చిత్రంలో విలన్‌గా విజయ్ నటించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి పెళ్లి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ లవ్ బర్డ్స్ మూడు ముళ్ల బంధంతో సంసార జీవితంలోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. నిజంగా తమన్నా, విజయ్ వర్మ ఇప్పట్లో పెళ్లి చేసుకోకూడదని భావించారు. కానీ ఇరు కుటుంబ సభ్యుల నుంచి విపరీతమైన ఒత్తిడి వస్తోందట. తమన్నా వయసు ప్రస్తుతం 33 సంవత్సరాలు కాగా, విజయ్ వర్మకు 37 ఏళ్లు ఉన్నాయి. దీంతో వయసు పైబడుతుందని త్వరగా పెళ్లి చేసుకోవాలని కోరడంతో ఇద్దరు పెళ్లికి ఒప్పుకున్నారట.
ఈ ఏడాది డిసెంబర్లో లేదా జనవరిలో వీరి నిశ్చితార్థం ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఫిబ్రవరిలో పెళ్లి జరగనున్నట్లు సమాచారం. అయితే, ఈ పెళ్లి వార్తలపై తమన్నా, విజయ్ వర్మ స్పందించలేదు.
ఇక సినిమాల విషయానికొస్తే ఇటీవల తమన్నా, విజయ్ కలిసి ‘లస్ట్ స్టోరీస్ 2’లో నటించారు. ఇందులో ఇద్దరు హాట్ సీన్లలో రెచ్చిపోయారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో 'భోళాశంకర్' మూవీలో హీరోయిన్గా నటించగా.. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' మూవీలో ఓ ఐటం సాంగ్‌లో అదరగొట్టింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com