ఎస్‌.గోపాల్ రెడ్డి త‌న‌యుడు భార్గ‌వ మృతి

  • IndiaGlitz, [Tuesday,May 08 2018]

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ భార్గవ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ అధినేత ఎస్‌.గోపాల్ రెడ్డి త‌న‌యుడు భార్గ‌వ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందారు. నెల్లూరు జిల్లా.. వాకాడ మండ‌టం కంబ‌లి వ‌ద్ద భార్గ‌వ మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వ‌చ్చింది.

అస‌లు భార్గ‌వ రెడ్డి ఎలా చ‌నిపోయార‌నే దానిపై పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. ప్ర‌మాద‌వ‌శాతు స‌ముద్రంలో ప‌డిపోయాడా?  లేక మ‌రేదైనా కార‌ణాలున్నాయా? అనే కోణం పోలీసులు ద‌ర్యాప్తు సాగుతుంది.

ఎస్‌.గోపాల్ రెడ్డి త‌నయుడు భార్గ‌వ రెడ్డి పేరు మీద‌నే భార్గ‌వ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌ను స్థాపించి కోడి రామ‌కృష్ణ‌, బాల‌కృష్ణ‌ల‌తో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను నిర్మించారు.