బాలీవుడ్‌కు రష్మిక
- IndiaGlitz, [Friday,April 26 2019]
శాండీవుడ్ సొగసరి రష్మిక మందన్న.. తెలుగు చిత్రసీమలో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. తమిళంలో కూడా కార్తి సరసన ఓ చిత్రంలో నటిస్తుంది. దక్షిణాదిన రష్మికకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పుడు బాలీవుడ్లో కూడా రష్మికకు అవకాశం దక్కింది.
అది కూడా సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో కావడం కొసమెరుపు. రణదీప్ హుడా కథానాయకుడుగా నటించబోయే ఈచిత్రంలో రష్మిక మందన్నాను హీరోయిన్గా తీసుకోవాలని సంజయ్ లీలా భన్సాలీ అనుకుంటున్నాడట.
బల్వీందర్ సింగ్ జాన్జువా ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. అయితే రష్మిక ఈ సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 'గీతగోవిందం' తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన 'డియర్ కామ్రేడ్' మే 31న విడుదల అవుతుంది.