'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ కి ముఖ్య అతిధిగా రామ్‌చ‌ర‌ణ్

  • IndiaGlitz, [Tuesday,April 24 2018]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా'. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు.

ఇటీవ‌ల తెలుగు వారంతా గ‌ర్వంగా చెప్పుకునే దేశ‌భ‌క్తికి చిరునామా మిలట్రీ మాధవరంలో ఆడియో ఫంక్షన్ చేశారు. ఇప్పుడు హైద‌రాబాద్ లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ని అత్యంత గ్రాండ్ గా చేస్తున్నారు. ఈ ఫంక్ష‌న్ కి తెలుగు వారంతా గ‌ర్వంగా చెప్పుకునేలా ఈ స‌మ్మ‌ర్ ని త‌న న‌ట‌న‌తో కూల్ చేసిన మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఇప్ప‌టికే సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని యు ఏ స‌ర్టిఫికేట్ తో మే 4 న సినిమా ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..... మా చిత్రం నాపేరు సూర్య చిత్రానికి మెద‌టినుండి పాజిటివ్ బ‌జ్ వ‌స్తుంది. మెము రిలీజ్ చేసిన ఫ‌స్ట్ ఇంపాక్ట్ ద‌గ్గ‌ర‌నుండి అంద‌ర్లో ఈ చిత్రం చూడాల‌నే ఆశ‌క్తి డ‌బుల‌వుతుంది. ఈచిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు.

ట్రేడ్ లో ఇప్ప‌టికే బ‌జ్ చాలా హై రేంజి లో వుండ‌టం చాలా ఆనందంగా వుంది. రంగ‌స్థ‌లం చిత్రం తో హ‌ట్ స‌మ్మ ర్ ని కూల్ చేసిన మ‌న చిట్టిబాబు.. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ నా పేరు సూర్య ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ కి ముఖ్య అతిధిగా వ‌స్తున్నారు. ఇది మెగా అభిమానుల‌కు పండ‌గ‌రోజు అని ప్ర‌త్యేఖంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

అలాగే ఇటీవ‌ల‌ మిలట్రీ మాధవరం లో ఆడియో ఫంక్ష‌న్ చేసుకున్నాము. ఆక్క‌డి ప్ర‌జ‌లు సారి అక్క‌డి సైనికులు వారి కుటుంబాలు మాకు ఇచ్చిన స్వాగ‌తం మ‌ర‌వ‌లేము. అంత‌గొప్ప ఊరులో మా ఫంక్ష‌న్ చేయ‌టం చాలా గ‌ర్వంగా ఫీల‌వుతున్నాము. మా హీరో స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ ని అక్క‌డి వారంతా ఘ‌న‌స్వాగ‌తం ఇచ్చారు. ఆయ‌న కూడా వారంద‌ర్ని ప్రేమతో ప‌ల‌క‌రించారు.

మా చిత్రం లో అల్లు అర్జున్ సైనికుడి పాత్ర కోసం ప్రత్యేకంగా తనను తాను మలచుకున్న విధానం ఔరా అనిపిస్తుంది. స‌ర్‌ప్రైజ్ డాన్స్ లు కూడా వుంటాయి. ఈ చిత్రంలో ఇలాంటి ఎన్నో స‌ర్‌ప్రైజ్ లు వున్నాయి. అలాగే మా ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ కూడా స‌ర్‌ప్రైజ‌స్ చాలా వున్నాయి.. అత్యంత భారీ ఈవెంట్ గా చేస్తున్నాము.

అలాగే ఈ ఫంక్ష‌న్ కి మెగా అభిమానులు అత్యంత భారీగా హ‌జ‌ర‌వుతున్నారు. ఏప్రిల్ 29న గ్రాండ్ ఈవెంట్ గా అభిమానుల గుండెల్లో చిర‌స్థాయిగా వుంటుంది. మే 4 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ గా విడుద‌ల కానుంది.. అని అన్నారు

More News

రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్స్ బ్యాన‌ర్‌లోరూపొందుతోన్న చిత్రం 'ఈ మాయ పేరేమిటో'

ముప్పై ఏళ్లుగా తెలుగు సినిమాల్లో ఎంతో మంది స్టార్స్‌కు అద్భుతమైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్.

స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్ టైన్మెంట్ ప్రొడ‌క్ష‌న్ నెం.2కు క్యాస్టింగ్ కాల్..

మ‌ళ్లీరావా లాంటి ఫీల్ గుడ్ ఎంట‌ర్ టైన‌ర్ త‌ర్వాత స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ ఈ మ‌ధ్యే ప్రొడ‌క్ష‌న్ నెం.2ను అనౌన్స్ చేసింది.

'స‌మ్మోహ‌నం' షూటింగ్ పూర్తి

కొత్త అనే ప‌దాన్ని రోజూ విన్నా కొత్త‌గానే ఉంటుంది.  ప్రేమ అనే ప‌దం కూడా అలాంటిదే. త‌ర‌త‌రాలుగా, యుగ‌యుగాలుగా మాన‌వాళికి ప్రేమ‌తో ప‌రిచ‌యం ఉంది.

మ‌హేష్‌.. ఐదేళ్ళ త‌రువాత

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఒకే ఏడాదిలో రెండేసి సినిమాల‌తో సంద‌డి చేసిన సంద‌ర్భాలు త‌క్కువ‌నే చెప్పాలి.

బాల‌య్య సినిమాకు పోటీగా..

నంద‌మూరి బాల‌కృష్ణకు క‌లిసొచ్చిన ద‌ర్శ‌కుల‌లో బోయ‌పాటి శ్రీ‌నుకి ప్ర‌త్యేక స్థాన‌ముంది. బాల‌య్య‌కు వరుస ప‌రాజ‌యాలు ఉన్న స‌మ‌యంలో.. సింహా, లెజెండ్ వంటి సినిమాల‌ను అందించి..