షూటింగ్ ద‌శ‌లో అడివి సాయికిర‌ణ్ 'ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్‌'

  • IndiaGlitz, [Sunday,September 02 2018]

ఆది సాయికుమార్, కార్తీక్ రాజు, పార్వ‌తీశం, శ‌షా చెట్రి(ఎయిర్ టెల్ మోడ‌ల్‌) , నిత్యా న‌రేశ్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం 'ఆప‌రేషన్ గోల్డ్ ఫిష్‌'.  మ‌నోజ్ నందం, కృష్ణుడు, అబ్బూరి ర‌వి, అనీశ్ కురువిల్లా, రావు ర‌మేశ్‌ కీల‌క పాత్ర‌ధారులు. వినాయ‌కుడు టాకీస్ బ్యాన‌ర్‌పై య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందించిన క‌ల్పిత కథాంశంతో.. 'వినాయ‌కుడు', 'విలేజ్‌లో వినాయ‌కుడు', 'కేరింత' వంటి సెన్సిబుల్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు అడివి సాయికిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ యాక్ష‌న్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ' తెర‌కెక్కుతోంది.

ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్ , పద్మనాభ రెడ్డి, గేరి.బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాత‌లు.  ఈ సినిమా షూటింగ్‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేసుకుంటుంది.

ఈ సంద‌ర్భంగా... ద‌ర్శ‌కు అడివి సాయికిర‌ణ్, నిర్మాత‌లు మాట్లాడుతూ - సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌ర‌పుకుంటుంది. ప్ర‌ముఖ ర‌చ‌యిత అబ్బూరి ర‌విగారు ఈ సినిమాలో ర‌చ‌యిత‌గానే కాదు.. విల‌న్‌గా కూడా న‌టించ‌బోతున్నారు. అలాగే మ‌నోజ్ నందం కూడా విల‌న్‌గా న‌టిస్తున్నారు. కాశ్మీర్, ఢిల్లీ, లంబసింగి, A.O.B, చింతపల్లి, అరకు, కాకినాడ పోర్ట్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ తదితర ప్రాంతాలలో సినిమా షూటింగ్ చేశాం.

ఓ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. శ్రీచ‌ĸ