జూలై 5న సమంత అక్కినేని ఫన్ రైడర్ `ఓ బేబీ` విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
సమంత అక్కినేని, లక్ష్మి, నాగశౌర్య, రావు రమేష్, రాజేంద్రప్రసాద్ ప్రధాన తారాగణంగా బి.వి.నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ` ఓ బేబీ`. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూలై 5న సినిమాను విడుదల చేస్తున్నారు. మిక్కి జె.మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
అన్ని ఎలిమెంట్స్‌ను మిక్స్‌చేసిన ఔట్ అండ్ ఔట్ ఫన్ రైడర్‌గా ఈ సినిమా రూపొందింది. కటుంబం, బంధాలు, బంధుత్వాలతో జీవితాన్ని ఎలా గడపాలనే విషయాలను ఆలోచింప చేసే కోణంలో సినిమాను డైరెక్టర్ నందినీ రెడ్డి తెరకెక్కించారు.
రీసెంట్గా విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు ప్రేక్షకుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రం కోసం ఆర్టిస్టులు, సాంకేతిక బృందంలో మహిళలు ఎక్కువగా పనిచేయడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com