హాజీపూర్ సైకో శ్రీనివాస్‌లో కొత్త కోణం!
Send us your feedback to audioarticles@vaarta.com
యాదాద్రి జిల్లా హజీపూర్‌లో ముగ్గురు బాలికలను పొట్టనపెట్టుకున్న సైకో శ్రీనివాస్‌ను లోతుగా పోలీసులు విచారించే కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే ముగ్గురు బాలికలనూ అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్న సైకో తాజాగా మరో కోణం వెలుగుచూసింది. అమ్మాయిలకు వలవేసి ఆపై అత్యాచారానికి పాల్పడే ఈ కామాంధుడికి వేములవాడకు చెందిన ఓ యువతితో ప్రేమలో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ యువతిని గాఢంగా ప్రేమించిన ఈ కీచకుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడలేదని పోలీసులకు చెప్పడంతో వారు ఒకింత ఆశ్చర్యపోయారు.
యువతితో పరిచయం ఎలా ఏర్పడింది..?
వేములవాడకు చెందిన యువతితో సైకోకు ఏ విధంగా పరిచయం ఏర్పడిందనే విషయం పోలీసు విచారణలో తెలిపాడు. ఓసారి వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయానికి వెళ్లిన శ్రీనివాస్‌రెడ్డికి స్థానిక యువతితో పరిచయం ఏర్పడింది. ఆమెపై మనసు పారేసుకున్న సైకో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడని.. అయితే యువతి కూడా ఒప్పుకోవడంతో శ్రీనివాస్ యువతిని ఏమీ చేయకుండా వదలిపెట్టాడని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న రాచకొండ పోలీసులకు తెలిపాడు. అతడి ఫేస్బుక్ ఖాతాలో ఆమెతో కలిసి తీసుకున్న ఫొటోలు కనిపించడంతో అటువైపు దృష్టిసారించిన పోలీసులు అతడిని ప్రశ్నించగా ఈ విషయాలు వెల్లడించాడు.
పెళ్లాడే ఉద్దేశంతోనే ఆమెకు ఎటువంటి హాని తలపెట్టకపోయి ఉండొచ్చని పోలీసులు అనుకుంటున్నారు. తరచూ వేములవాడ వెళ్లి ఆమెను కలిసేవాడని.. శ్రీనివాస్ గురించి పూర్తిగా తెలియని ఆమె అతడితో చనువుగా ఉండి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి పెళ్లి ప్రతిపాదనను యువతి అంగీకరించడంతో బతికిపోయిందని పోలీసులు తెలిపారు. కాగా సైకోను ప్రస్తుతం ఇంకా విచారిస్తున్నారు. మున్ముందు పోలీసుల విచారణలో ఎన్నెన్ని బాగోతాలు బయటపడతాయో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments