'దేవ‌దాస్' రిలీజ్ డేట్‌

  • IndiaGlitz, [Thursday,July 12 2018]

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్‌లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నాగ్ డాన్‌గా, నాని ఒక డాక్టర్‌గా నటిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి 'దేవ‌దాస్‌' అనే టైటిల్‌ను ఇటీవ‌ల ఖ‌రారు చేసిన సంగ‌తి తెలిసిందే.

కాగా.. ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13న విడుదల చేయాల‌ని నిర్మాత‌లు అనుకున్న‌.. ఆల్ రెడీ పోటీలో చాలా చిత్రాలు ఉండ‌టంతో సినిమాను సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల చేయడానికి ప్లాన్ చేస్తున్నార‌ట‌.

More News

కొత్త ద‌ర్శ‌కుడితో తేజ్‌...

వ‌రుస‌గా ఆరు ప‌ర‌జయాలు చ‌విచూసిన మెగా క్యాంప్ హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ త‌దుప‌రి సినిమా కోసం స‌మాయ‌త్త‌మ‌వుతున్నాడు. వివ‌రాల ప్ర‌కారం ఈ సారి తేజ్ ..

'రంగస్థలం', 'మహానటి' లకు అరుదైన గౌరవం

రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'రంగస్థలం'. ఇటు ప్రేక్షకులు, అటు విమ‌ర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం తిరుగులేని విజయాన్ని దక్కించుకుంది.

వరుణ్ తేజ్, డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి సినిమా విడుదల తేది ఖరారు!

హీరో వరుణ్ తేజ్, దర్శకుడు సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో  వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, ఆడితిరావు హైదరీ కథానాయికలుగా నటిస్తున్నారు.

టాకీపార్ట్ పూర్తి చేసుకున్న సమంత 'యూటర్న్' !

సమంత ముఖ్య పాత్రలో నటించిన 'యూటర్న్' సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది.

దిల్ రాజు - ఇంద్రగంటి కాంబినేషన్ లో మల్టీస్టారర్

తెలుగు ఇండ‌స్ట్రీలో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు క‌నుమ‌రుగైన సంద‌ర్భంలో 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు' వంటి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను వెంకటేశ్‌, మ‌హేశ్ వంటి స్టార్ హీరోల‌తో