25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారు.. మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు..
Send us your feedback to audioarticles@vaarta.com
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 మంది బీఆర్స్ ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలిపారు. ప్రభుత్వంపై కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ అహంకారపూరిత వైఖరి వల్లే బీఆర్ఎస్ పార్టీకి ఈ దుస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. కరీంనగర్లో రైతులను పరామర్శించడానికి వెళ్లిన కేసీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడారని ఆయన పదేళ్ల పాలనలో ఇరిగేషన్ మీద లక్షల కోట్ల దోపిడీ చేశారని ఆరోపించారు.
"తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను బొంద పెడితే 104 మంది ఎమ్మెల్యేల నుంచి 39కి పడిపోయారు. 29 మంది మీ ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిన్ను, నీ పార్టీని ప్రజలు బొంద పెట్టడం ఖాయం. నీకు తెలివి తక్కువ, పొగరు ఎక్కువ. ఎక్కువ తక్కువ మాట్లాడితే ఎవ్వరూ పడరు. ప్రపంచంలో నువ్వొక్కడివే మేధావివా? మేడిగడ్డ కుంగింది అన్నప్పుడు ఎక్కడ ఉన్నావ్. మాకు అభివృద్ధి చేయడం తెలుసు, నీకు కమిషన్లు తీసుకోవడం తెలుసు. రైతులు ప్రస్తుతం ఇబ్బందులు పడడానికి కేసీఆరే కారకుడు. వ్యక్తిగత లాభం కోసం కృష్ణా, సాగర్ జలాలను ఏపీకి తాకట్టు పెట్టారు.
ముందుచూపు లేకపోవడం వల్లనే ఈ రోజు నీటి సమస్య వచ్చింది. కేసీఆర్ తీసుకొచ్చిన కరువు ఇది. కేసీఆర్ పాలనలో ఏ ప్రాజెక్టు కూడా సక్రమంగా డిజైన్ చేయలేదు. బ్యారేజీలకు, డ్యామ్‌లకు తేడా తెలియని వ్యక్తి కేసీఆర్. లక్ష కోట్లు అప్పు తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి.. చిన్న చిన్న తప్పులు అని సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ప్రతి సంవత్సరం 17 వేల కోట్లు అప్పు కట్టాల్సి వస్తోంది. కేసీఆర్ అన్ని అసత్యాలే మాట్లాడుతున్నాడు ఆయన మాటలు నమ్మొద్దు. నష్టపోయిన ప్రతి రైతుకు మా సానుభూతి, నష్టపరిహారం ఉంటుంది"అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
ఇక కేసీఆర్ అసహ్యమైన భాష చూస్తుంటే సిగ్గుగా ఉందని అధికారం కోల్పోయామనమే తీవ్ర అసహనంతో ఆయన మాట్లాడుతున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని.. మేము మిమ్మల్ని తొక్కుతామో మీరు మమ్మల్ని తొక్కుతామో చూసుకుందాం అని సవాల్ విసిరారు. పదేళ్లు అధికారంలో ఉండి ప్రాజెక్టులపై ఏం చేయకుండా నాలుగు నెలలు అధికారంలో ఉన్న తమను బద్నాం చేస్తావా అంటూ మరో మంత్రి జూపల్లి మండిపడ్డారు. చవట, దద్దమ్మ కేసీఆర్ ధనిక రాష్ట్రాన్ని లక్షల కోట్లు అప్పుల రాష్ట్రంగా మార్చారని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మొత్తానికి ఉత్తమ్ అన్నట్లుగా 29 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే కేసీఆర్ కుటుంబం తప్పితే ఇంకెవ్వరూ ఆ పార్టీలో ఉండరు. మరి మున్ముందు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com