మా లవ్ జర్నీ సక్సెస్' ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి కథానాయకుడిగా 'మా లవ్ జర్నీ సక్సెస్' చిత్రం శనివారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ధన్వంతరీ క్రియేషన్స్ పతాకంపై కె.పి.లక్ష్మణాచారి నిర్మిస్తున్నారు. శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వం వహిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి నవీన్ యాదవ్ క్లాప్ ఇచ్చారు. కోటి గౌరవ దర్శకత్వం వహించారు.
కోటి మాట్లాడుతూ "రాజీవ్ నటిస్తున్న పదో సినిమా ఇది. మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమా కథ బావుంది. తనకి మంచి గుర్తింపు తెస్తుందనే నమ్మకం ఉంది. నేను సంగీతం అందించే ఏ సినిమా అయినా మొదటి సినిమాగానే భావిస్తా. సంగీతానికి మంచి స్కోపున్న సినిమా ఇది" అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ "పదేళ్ల క్రితం ఇదే బేనర్లో ఓ సినిమా చేశా. మళ్లీ మంచి కథతో ఈ సినిమా చేస్తున్నా. "ప్రేమికుల్ని అర్థం చేసుకోకుండా నెట్టేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రేమికుల్ని విడదీయకూడదు... కలిపే ప్రయత్నం చెయ్యాలి" అన్న కథాంశంతో రూపొందుతున్న సినిమా ఇది. హీరోయిన్ క్యారెక్టర్ క్లాస్‌గా, హీరో క్యారెక్టర్ మాస్‌గా ఉంటుంది" అని చెప్పారు.
"ప్రేమ విఫలమైతే ఏం చెయ్యాలో తెలియని నేటితరం ప్రేమికులకు తమ ప్రేమని ఎలా దక్కించుకోవాలో చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. పది రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలువుతుంది. త్వరలో చిత్రీకరణ పూర్తి చేసి జూన్‌లో సినిమాను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని నిర్మాత తెలిపారు.
ఈ చిత్రానికి కెమెరా: పి.విజయ్‌కుమార్, సంగీతం: కోటి, ఎడిటర్: నందమూరి హరి, సాహిత్యం: చంద్రబోస్, వెనిగళ్ల రాంబాబు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments