కాజల్... వితౌట్..
Send us your feedback to audioarticles@vaarta.com
వితౌట్ మేకప్‌తో కాజల్ పెట్టిన ఫొటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ముఖం మీద తేలికపాటి మచ్చలతో కాజల్ పోస్ట్ చేసిన ఫొటోల గురించే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఎప్పుడూ మేకప్‌తో కనిపించే కాజల్ ఉన్నపళాన ఎందుకు పెట్టాల్సి వచ్చిందా అని పలు రకాలుగా ఆలోచిస్తున్నారు. అలాంటి వారి కోసమే కాజల్ ఇన్‌స్టాలో పెద్ద పోస్ట్ పెట్టారు.`` సామాజిక మాధ్యమాలు ఏలుతున్న ఈ రోజుల్లో మనం ఎలా ఉండాలనే విషయాలను అవి మరింత ఫోకస్ చేసి చూపిస్తున్నాయి. ప్రతి ఏటా కొన్ని కోట్ల రూపాయలను సౌందర్య సాధన ఉత్పత్తుల కోసం ధారపోస్తున్నాం. అవన్నీ అవయవసౌష్టవాన్ని అందంగా చూపిస్తాయని అనుకుంటున్నాం. ప్రతిచోటా శరీరాకర్షణ రాజ్యమేలుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం సౌందర్యం కోసం పాకులాడే వాళ్లల్లో ఉండాలా? లేకుంటే విడిగా ఉండాలా అనేది ఆలోచించుకోవాలి. ఒక్క మాట చెప్పాలంటే మేకప్ మన బాహ్య సౌందర్యాన్ని ఇనుమడింప చేస్తుందేగానీ, అంతఃసౌందర్యాన్ని మారుస్తుందా? మన ప్రవర్తనలో మార్పు తీసుకురాగలుగుతుందా? మనం ఎవరో, ఏమిటో చెప్పగలగుతుందా`` అనేది ఆ పోస్ట్ సారాంశం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout