క‌బీర్ లాల్ సార‌థ్యంలో ద‌క్షిణాది భాష‌ల్లో రీమేక్ అవుతున్న స్పానిష్ మూవీ 'జూలియాస్ ఐస్‌'

  • IndiaGlitz, [Friday,May 04 2018]

యు.ఎస్‌కు చెందిన యంగ్ అండ్ ఫ్రీ ఫిలింస్ ఎల్ఎల్‌సి, ఇండియాకు చెందిన మూవీ మేజిక్‌, ప్ల‌స్ ఎక్యుప్స్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా ... స్పానిష్‌లో సూప‌ర్ హిట్ థ్రిల్ల‌ర్ జూలియాస్ ఐస్‌ను తెలుగు, త‌మిళంలో రీమేక్ చేస్తున్నారు.

త‌న క‌వ‌ల సోద‌రిని చంపిన దుండ‌గుల‌ను క‌నుగొనే ఓ అమ్మాయి క‌థే ఈ సినిమా. మిస్ట‌రీని చేదిస్తున్న క్ర‌మంలో ఆమె త‌న కంటి చూపును క్ర‌మంగా కోల్పోతూ ఉంటుంది. యూర‌ప్‌లో విడుద‌లైన ఈ చిత్రం హ్యూజ్ హిట్ అయ్యి 20 మిలియ‌న్ డాల‌ర్స్‌ను వ‌సూలు చేసింది.

గ్యుల్లేర్మో డేల్ టోరో స‌మ‌ర్ప‌ణ‌లో యూనివ‌ర్స‌ల్ పిక్చ‌ర్స్ సంస్థ‌పై నిర్మిత‌మైన ఈ థ్రిల్ల‌ర్ రొటేన్ టోమాటోస్‌లో 91 శాతం రేటింగ్‌ను పొందింది. ఈ సినిమాను కన్న‌డం, మ‌రాఠీ, మల‌యాళ భాషల్లో కూడా రీమేక్ చేయ‌బోతున్నారు.

మూవీ మేజిక్ అధినేత‌, ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ క‌బీర్ లాల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బాలీవుడ్ చిత్రాలు ప‌ర‌దేశ్‌, అప్నే యువ‌రాజ్‌, వెల్‌క‌మ్ బ్యాక్ స‌హా ప‌లు చిత్రాలతో పాటు తెలుగులో ఆదిత్య 369, భైరవ ద్వీపం, అంద‌రివాడు, స్టైల్ స‌హా 25 సినిమాల‌కు అద్భుత‌మైన విజువ‌ల్స్‌ను అందించారు. తాళ్‌, ప‌ర‌దేశ్ చిత్రాల‌కు ఫిలింఫేర్ అవార్డుల‌ను సైతం గెలుచుకున్నారు.

'జూలియాస్ ఐస్' వంటి గొప్ప థ్రిల్ల‌ర్‌ను మ‌న దేశంలోని ప‌లు భాష‌ల్లో రీమేక్ చేయ‌బోతున్నందుకు ఆనందంగా ఉంది. తప్ప‌కుండా సినిమా ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌ను కూడా మెప్పిస్తుంది' అని క‌బీర్‌లాల్ ఈ సంద‌ర్భంగా తెలిపారు. 

ప్ర‌ముఖ అమెరిక‌ల్ ఫిలిమ్ మేక‌ర్ ప‌ర‌మ్ గిల్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను 2019లో విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు.