close
Choose your channels

Samantha:అనారోగ్యం, విడాకులు.. ఇలా ఒక్కసారిగా సమస్యలు చుట్టుముట్టాయి: సమంత

Thursday, November 9, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్టార్ హీరోయిన్ సమంత తన వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి విఫలమవ్వడం, ఆరోగ్య సమస్యలు, వరుస ఫ్లాప్‌లు తనను ఎంతో ఇబ్బందికి గురిచేశాయని చెప్పుకొచ్చారు. "ఓవైపు నా ఆరోగ్యం దెబ్బతింటుంటే.. మరోవైపు నా వైవాహిక బంధం కూడా ముగిసింది. అదే సమయంలో నేను నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఎన్నో కష్టాలు ఒక్కసారిగా నన్ను చుట్టుముట్టాయి. దీంతో ఎంతో బాధపడ్డాను. గత రెండు సంవత్సరాలుగా నేనెంతో కుంగుబాటుకు గురయ్యాను. ఆ సమయంలో ఎంతోమంది నటీనటుల గురించి చదివాను. వారి ఆరోగ్య సమస్యలను ఎలా ఎదుర్కొన్నారు, ట్రోలింగ్‌లను ఎలా తట్టుకున్నారో తెలుసుకున్నా. వాళ్ల గురించి చదవడం నాకెంతో సహాయపడింది. వారు చేయగలిగినప్పుడు నేను కూడా చేయగలననే ధైర్యం వచ్చింది. అదే నాకు బలాన్నిచ్చింది’’ అని తెలిపారు.

దేశంలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందడం ఎంతో గొప్ప అదృష్టమని సమంత తెలిపారు. ‘‘ఒక నటిగా గుర్తింపు తెచ్చుకోవడం అద్భుతమైన బహుమతి. అందుకే నటిగా నా బాధ్యతను నిర్వర్తించడంలో ఎంతో నిజాయితీగా ఉంటాను. నటీనటుల జీవితాలంటే ఎప్పుడూ సినిమాల ఫలితాలు, అవార్డులు, వాళ్లు వేసుకున్న దుస్తులు మాత్రమే కాదు. వాళ్లకు కూడా ఎన్నో కష్టాలు, బాధలు ఉంటాయి. నా ఒడుదొడుకులు అందరికీ తెలిసినందుకు నేనేం బాధపడను. నాలాంటి వాళ్లు ఎంతో మంది ఉన్నారు. వారంతా నాలాగే పోరాడే శక్తిని పొందాలని నేను ఆశిస్తున్నా’’ అని వెల్లడించారు.

కాగా కొంతకాలంగా మయోసైటిస్‌ సమస్యతో బాధపడుతున్న సామ్.. ఇటీవల విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకున్నారు. మధ్యలో మూవీ షూటింగ్‌లకు బ్రేక్ తీసుకుని ఇంట్లోనే చికిత్స తీసుకున్నారు. తర్వాత కాస్త కోలుకోగానే ఖుషి, సిటాడెల్ చిత్రాలను పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె భూటాన్‏లో మయోసైటిస్ చికిత్స కోసం సిద్ధమవుతున్నారు. అక్కడ హాట్‌స్టోన్ బాత్ అనే ఆయుర్వేదిక్ ట్రీట్‌మెంట్ తీసుకోనున్నారు. ఈ చికిత్స వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగనుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment