Samantha:అనారోగ్యం, విడాకులు.. ఇలా ఒక్కసారిగా సమస్యలు చుట్టుముట్టాయి: సమంత

  • IndiaGlitz, [Thursday,November 09 2023]

స్టార్ హీరోయిన్ సమంత తన వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి విఫలమవ్వడం, ఆరోగ్య సమస్యలు, వరుస ఫ్లాప్‌లు తనను ఎంతో ఇబ్బందికి గురిచేశాయని చెప్పుకొచ్చారు. ఓవైపు నా ఆరోగ్యం దెబ్బతింటుంటే.. మరోవైపు నా వైవాహిక బంధం కూడా ముగిసింది. అదే సమయంలో నేను నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఎన్నో కష్టాలు ఒక్కసారిగా నన్ను చుట్టుముట్టాయి. దీంతో ఎంతో బాధపడ్డాను. గత రెండు సంవత్సరాలుగా నేనెంతో కుంగుబాటుకు గురయ్యాను. ఆ సమయంలో ఎంతోమంది నటీనటుల గురించి చదివాను. వారి ఆరోగ్య సమస్యలను ఎలా ఎదుర్కొన్నారు, ట్రోలింగ్‌లను ఎలా తట్టుకున్నారో తెలుసుకున్నా. వాళ్ల గురించి చదవడం నాకెంతో సహాయపడింది. వారు చేయగలిగినప్పుడు నేను కూడా చేయగలననే ధైర్యం వచ్చింది. అదే నాకు బలాన్నిచ్చింది’’ అని తెలిపారు.

దేశంలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందడం ఎంతో గొప్ప అదృష్టమని సమంత తెలిపారు. ‘‘ఒక నటిగా గుర్తింపు తెచ్చుకోవడం అద్భుతమైన బహుమతి. అందుకే నటిగా నా బాధ్యతను నిర్వర్తించడంలో ఎంతో నిజాయితీగా ఉంటాను. నటీనటుల జీవితాలంటే ఎప్పుడూ సినిమాల ఫలితాలు, అవార్డులు, వాళ్లు వేసుకున్న దుస్తులు మాత్రమే కాదు. వాళ్లకు కూడా ఎన్నో కష్టాలు, బాధలు ఉంటాయి. నా ఒడుదొడుకులు అందరికీ తెలిసినందుకు నేనేం బాధపడను. నాలాంటి వాళ్లు ఎంతో మంది ఉన్నారు. వారంతా నాలాగే పోరాడే శక్తిని పొందాలని నేను ఆశిస్తున్నా’’ అని వెల్లడించారు.

కాగా కొంతకాలంగా మయోసైటిస్‌ సమస్యతో బాధపడుతున్న సామ్.. ఇటీవల విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకున్నారు. మధ్యలో మూవీ షూటింగ్‌లకు బ్రేక్ తీసుకుని ఇంట్లోనే చికిత్స తీసుకున్నారు. తర్వాత కాస్త కోలుకోగానే ఖుషి, సిటాడెల్ చిత్రాలను పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె భూటాన్‏లో మయోసైటిస్ చికిత్స కోసం సిద్ధమవుతున్నారు. అక్కడ హాట్‌స్టోన్ బాత్ అనే ఆయుర్వేదిక్ ట్రీట్‌మెంట్ తీసుకోనున్నారు. ఈ చికిత్స వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగనుంది.

More News

Chandrababu:చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వాయిదా వేసింది.

CM KCR:గజ్వేల్‌లో నామినేషన్ వేసిన సీఎం కేసీఆర్..

తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల అంఖం తుది దశకు చేరుకుంది. రేపటితో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది.

Bigg Boss Telugu 7 : హగ్గులు, ముద్దులతో ప్రియాంకను ముంచెత్తిన ప్రియుడు.. కిచెన్‌కే అంకితమవుతావా హిత బోధ

బిగ్‌బాస్ హౌస్‌లో గొడవలు, వాగ్వాదాలకు బదులుగా ఈ వారం ఎమోషనల్ టచ్ ఇస్తున్నారు నిర్వాహకులు. కుటుంబ సభ్యులను, మిత్రులను హౌస్‌లోకి పంపుతూ కంటెస్టెంట్స్‌‌ను ఖుషీ చేస్తున్నారు.

Rashmika Mandanna : రష్మికకు తెలుగు ఫిలిం జర్నలిస్ట్‌ల బాసట .. తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా పేరుతో వైరల్ అవుతోన్న మార్ఫింగ్ వీడియో ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారింది.

MP Ponguleti:చెప్పినట్లే జరిగింది.. మాజీ ఎంపీ పొంగులేటి ఇంటిపై ఐటీ దాడులు..

ఓవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతుండగా.. మరోవైపు కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో