BiggBoss: నేను ఫ్లాప్ అయ్యా... ఒప్పేసుకున్న చలాకీ చంటీ, ఈవారం ఎలిమినేట్ అయ్యేది అతనేనా..?
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ సీజన్ 6లో ఈ వారం ఎలాంటి గొడవలు, వాదనలు లేకుండా సజావుగా సాగిపోయింది. పెద్దగా గట్టి టాస్క్‌లు పడకపోవడమో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ ఈ వారం బిగ్‌బాస్‌లో పెద్దగా మెరుపులు లేవు. దీంతో హోస్ట్ నాగార్జునకు కూడా క్లాస్ పీకేందుకు ... కంటెస్టెంట్స్‌ని నిలదీసేందుకు చేతిలో ఎలాంటి కారణాలు ఆయనకు కనిపించలేదు. దీంతో శనివారాన్ని ఫుల్ ఫన్‌డేగా ప్లాన్ చేశారు నాగ్. వచ్చి రాగానే గత వారం కెప్టెన్‌గా కీర్తి ఎలా చేసిందో చెప్పాల్సిందిగా ఆదిరెడ్డిని కోరాడు. దీనికి మనోడు.. కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక సందర్భంగా రాజ్‌ను కాకుండా శ్రీహాన్, ఇనయాలలో ఒకరిని సెలెక్ట్ చేస్తే బాగుండేదని రివ్యూ ఇచ్చాడు. దీనిపై కీర్తిని నాగ్ ప్రశ్నించగా.... నా కళ్లకు ఏది కనిపిస్తే అదే చేశానని, శ్రీహాన్ ఎంటర్‌టైన్ చేయడం తాను చూడలేదని చెప్పడంతో సంతృప్తి చెందిన ఆయన ఆమెను ప్రశంసించారు.
తర్వాత ఇంటి సభ్యులతో ‘‘ఎవరు హిట్ ..? ఎవరు ఫ్లాప్ ..?’’ అనే ఓ గేమ్ ఆడించారు నాగార్జున. ఇందులో తాను ఇద్దరి పేర్లను పిలుస్తానని.. వారిద్దరిలో ఎవరు హిట్, ఎవరు ఫ్లాప్ అనేది వాళ్లే తేల్చుకోవాలని చెప్పారు. ముందుగా ఇనయా, సూర్యలను పిలవగా... ఇంటి సభ్యులు సూర్యకి హిట్ అని, ఇనయాకి ఫ్లాప్ అని ఓట్లు వేశారు. గీతూ, ఆదిరెడ్డిలలో ఆదిరెడ్డికి హిట్... గీతూకి ఫ్లాప్ వచ్చింది. ఇక ఈరోజు అన్నింటికంటే హైలైట్ మాత్రం చంటి- సుదీపలదే. చంటి తాను హిట్ అని చెప్పుకోవడం లేదని.. నేను ఫ్లాప్ అని ఒప్పేసుకుంటున్నా అని చెప్పాడు. హౌస్‌మేట్స్ కూడా చంటి ఫ్లాపేనంటూ ఓట్లు వేయడం గమనార్హం. అర్జున్ వాసంతిలలో వాసంతి హిట్.. అర్జున్ ఫ్లాప్ అని ఇంటి సభ్యులు చెప్పారు. బాలాదిత్య రాజ్‌లలో బాలాదిత్యకు హిట్, రాజ్‌కు ఫ్లాప్...మెరీనా ఫైమాలలో మెరీనాకి హిట్, ఫైమాకి ఫ్లాప్ ....రోహిత్ కీర్తిలలో కీర్తికి హిట్, రోహిత్‌కు ఫ్లాప్... శ్రీహాన్ శ్రీసత్యలలో శ్రీహాన్‌కు హిట్, శ్రీసత్యకి ఫ్లాప్ వచ్చింది. చివరికి రేవంత్ ఒక్కటే మిగలడంతో.. హౌస్‌మేట్స్ అభిప్రాయాల ప్రకారం అతనికి హిట్ వచ్చినట్లు నాగార్జున ప్రకటించారు.
తర్వాత నామినేషన్స్‌లో వున్న వారికి బెలూన్ టాస్క్ ఇచ్చారు నాగ్. ఒక్కొక్కరికి బెలూన్ ఇచ్చి అందులో చీటీ వుంటుందని.. దానిలో సేఫ్ అని వచ్చినవాళ్లు సేఫ్ అవుతారని, అన్ సేఫ్ అని వస్తే సేఫ్ అవ్వరని చెప్పారు. ఇందులో ఆదిరెడ్డి సేవ్ అయ్యాడు. అనంతరం మిగిలిన వారికి క్యాప్ టాస్క్ ఇవ్వగా... ఫైమా సేవ్ అయ్యింది. మరో టాస్క్‌లో బాలాదిత్య సేవ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.
ఇకపోతే.. ఈవారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే దానిపై అప్పుడే సోషల్ మీడియాలో పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. వాసంతి, చంటి, మెరీనా, అర్జున్‌లు డేంజర్ జోన్‌లో వున్నారు. అయితే ఇనయా వెంట పిచ్చోడిలా తిరుగుతున్న అర్జున్ కల్యాణ్‌కి సింపతీ ఓట్లు పడుతుండటంతో అతను సేవ్ అయ్యే ఛాన్స్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాసంతి విషయానికి వస్తే.. ఆమె టాస్కుల్లో శ్రద్ధ చూపించకపోయినా.. కెమెరా స్పేస్‌కి కనిపించకపోయినా తన అందచందాలతో ఇంటికే కళ తీసుకొస్తుండటంతో ఆమె కూడా సేవ్ అయినట్లుగా తెలుస్తోంది. మెరీనా , చంటిల విషయానికి వస్తే.. వచ్చినప్పటి నుంచి భర్త రోహిత్ వెంట ఉండటం తప్పించి మెరీనాకి ఎవరితోనూ గొడవలు లేవు. జబర్దస్త్ చలాకీ చంటి మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శన నేటి వరకు ఇవ్వలేదు. ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్న వాడిలా వుంటున్నాడు. గత వారం హోటల్ టాస్క్‌లో బిగ్‌బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌ను కూడా సరిగా చేయలేకపోయాడు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం.. చంటికి ఇంటి మీద బెంగ ఎక్కువ కావడం... రెండు మూడు రోజులుగా సరిగా అన్నం తినకపోవడంతో అతనే ఈసారి ఎలిమినేట్ అవుతారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments