'దూసుకెళ్తా' వాయిదా పడింది
Send us your feedback to audioarticles@vaarta.com
'ఢీ', 'దేనికైనా రెడీ' చిత్రాల తరువాత మంచు విష్ణు కెరీర్ లో మరో హిట్ చిత్రంగా నిలిచే సినిమాగా 'దూసుకెళ్తా' ఉంటుందని ఆ చిత్రయూనిట్ పలుమార్లు చెప్పుకురావడం జరిగింది. అక్టోబర్ 24న మొదట ఈ సినిమాకి విడుదల తేదిగా ఫిక్స్ చేసినా.. ప్రీ పోన్ చేసి మరీ దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ సినిమాని విడుదల చేయాలని చిత్ర బృందం సహాయత్తమైంది. అయితే రాష్ట్రంలోని కొన్ని పరిస్థితుల కారణంగా ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయిందని వినిపిస్తోంది.
వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమాని అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీత దర్శకుడు. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందనే వస్తోంది. మంచు విష్ణు పది సంవత్సరాల కెరీర్ ని పూర్తి చేసుకున్న సందర్భంలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని పొందుతుందో. మరో 12 రోజుల్లో తెలుస్తుంది.
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com