'బిరియాని' కార్తీది కాదట
Send us your feedback to audioarticles@vaarta.com
'యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరుశివ' వంటి అనువాద చిత్రాలతో తెలుగువారికి సుపరిచితమైన తమిళ కథానాయకుడు కార్తీ. ఈ యంగ్ హీరో నటించిన తాజా చిత్రం 'బిరియాని' ఈ నెల 20న తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. హన్సిక హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకుడు.
సంగీత దర్శకుడిగా యువన్ శంకర్ రాజా ఈ చిత్రంతో 100 చిత్రాల మైలురాయిని చేరుకుంటున్నాడు. ఇదిలా ఉంటే. 'బిరియాని' కథని దర్శకుడు వెంకట్ ప్రభు. కార్తీని దృష్టిలో పెట్టుకుని రాసింది కాదని. విజయ్ ని దృష్టిలో పెట్టుకుని రాసాడని. తొలుత ఈ సినిమాని చేయడానికి విజయ్ అంగీకరించినా. కాల్షీట్ల సమస్య కారణంగా 'బిరియాని' ని వదులుకున్నాడని తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆ తరువాత 'బిరియాని'ని సూర్యతో చేయడానికి ప్రయత్నించినా అతనిదీ అదే పరిస్థితి కావడంతో. కార్తీ ఓకే చెప్పడంతో ఈ సినిమాకి ఓ రూపం వచ్చిందట. కథాబలమున్న ఈ స్టైలీష్ సినిమాతో కార్తీ కెరీర్ లో ఓ ఘనవిజయం ఖాయమని అక్కడి సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Follow us on Google News and stay updated with the latest!
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com