నీ కన్నా ఏజ్ ఎక్కువున్న నటితో డేటింగ్ ?.. హీరో ఆన్సర్ విన్నారా!
Send us your feedback to audioarticles@vaarta.com
ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ సెలెబ్రిటీల మద్య జరుగుతున్న ప్రేమ వ్యవహారాలు చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్ లో ఈ తంతు కాస్త ఎక్కువగానే ఉంటుంది. ప్రియాంక చోప్రా తన కన్నా పదేళ్లు చిన్నవాడైన నిక్ జోనస్ ని పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. సీనియర్ హీరోయిన్ సుస్మిత సేన్ కూడా ప్రస్తుతం ఓ యువకుడితో ఎఫైర్ సాగిస్తోంది. కానీ వార్తల్లో ఎప్పుడూ నిలిచేది మాత్రం సెక్సీ బ్యూటీ మలైకా, అర్జున్ కపూర్ జోడినే.
అర్భాజ్ ఖాన్ తో విడాకులైన తర్వాత మలైకా, అర్జున్ కపూర్ మద్య ఎఫైర్ మొదలయింది. అర్జున్ కపూర్ కన్నా మలైకా వయసులో 12 ఏళ్ళు పెద్ద. అర్భాజ్ ఖాన్ తో ఆమెకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఈ అంశాలన్నింటి వల్ల అర్జున్ కపూర్,మలైకా ఎఫైర్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇదీ చదవండి: నితిన్ హీరోయిన్ సెన్సేషనల్ ఫోటోషూట్.. టాప్ లెస్ గా హాట్ షో!
2019 నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఇది ఓపెన్ సీక్రెట్ అయినప్పటికీ మీడియా ముందు మాత్రం తమ వ్యక్తిగత విషయాలని ఈ జంట రివీల్ చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం జంటగా ఫోటోలు షేర్ చేస్తూ తమ బంధాన్ని చెప్పకనే చెబుతున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఎఫైర్ కి సంబంధించిన ప్రశ్న అర్జున్ కపూర్ కి ఎదురైంది. ఈ ప్రశ్నకు అర్జున్ కపూర్ చికాకు తెచ్చుకోకుండా తెలివిగానే సమాధానం ఇచ్చాడు. తన పాస్ట్ మ్యారేజ్ ద్వారా ఓ కొడుకు ఉండి, వయసులో పెద్దైన మహిళతో డేటింగ్ చేయడం పట్ల స్పందిస్తారా అనే ప్రశ్న ఎదురైంది.
దీనికి అర్జున్ కపూర్ బదులిస్తూ.. నా వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా మాట్లాడను. కానీ ఒక్క విషయం ఏంటంటే.. మన భాగస్వామిని మనం గౌరవించాలి. ఆమెకున్న గతం గతమే. ఆమె ఎంచుకున్న బౌండరీలని కూడా కాదనకూడదు. వ్యక్తిగత విషయాల గురించి బయట మాట్లాడడం వల్ల పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. కానీ ఆమె కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలా చేయగలను అని అర్జున్ కపూర్ బదులిచ్చాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments