40 కోట్ల కామ్రేడ్...
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ దేవర కొండ సినిమాలకు మంచి క్రేజ్ ఏర్పడుతున్నాయి. అర్జున్ రెడ్డి, ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం చిత్రాలు విజయ్ దేవరకొండకు హీరోగా క్రేజ్‌తో పాటు బిజినెస్ పరంగా మార్కెట్‌ను కూడా పెంచేశాయి.
గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా 'డియర్ కామ్రేడ్'. భరత్ కమ్మ దర్శకుడు.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది.
అయితే అంచనాలు మేర భారీ ప్రైజ్‌తో కాకుండా రీజనబుల్ ప్రైజ్‌తోనే నిర్మాతలు బిబినెస్ చేస్తున్నారట. నైజాంను 7.5 కోట్లు, సీడెడ్ 3.5 కోట్లు, ఆంధ్రా ఏరియాను 10 కోట్లకు ఇస్తున్నారట.
ఇక ఓవర్సీస్ సహా ఇతర ప్రాంతాలకు కలిపితే మొత్తంగా దాదాపు 40 కోట్ల రూపాయల ప్రి రిలీజ్ బిజినెస్ పూర్తి చేసుకున్నాడు డియర్ కామ్రేడ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అయితే ఈ రేంజ్ ఇంకా పెరుగుతుందనడంలో సందేహం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments