'చిరు తేజ్ సింగ్' జీవిత చరిత్ర ఆధారంగా బాలల చిత్రం
- IndiaGlitz, [Friday,March 16 2018]
నిర్మాత N.S NAIK గారి సహాయసహకారాలతో అవార్డ్ విన్నింగ్ లఘు చిత్రాల దర్శకులు డా. ఆనంద్ కుమార్ దర్శకత్వంలో తన అద్భుత మేధాశక్తితో ప్రపంచ రికార్డును నెలకొల్పిన గిరిజన బాలిక చిరుతేజ్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించబడిన బాలల చిత్రం చిరుతేజ్ సింగ్.
ఫ్యాషన్ డిజైనర్ ఫేమ్ మనాలి రాథోడ్, కాటమరాయుడు ఫేమ్ సౌమ్యవేణుగోపాల్ ప్రధానపాత్ర పోషించారు. కేవలం 3 నిమిషాల వ్యవధిలో 236 ప్రపంచ పటాలను గుర్తించి, బాల మేధావిగా ఎన్నో పతకాలను, ప్రశంసలను సొంతం చేసుకొని తెలుగు జాతి,మరియు భారతదేశ ప్రతిష్టను పెంచిన చిరుతేజ్ సింగ్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తల్లి కూతురి మధ్య ప్రేమ ,టీచర్ స్టూడెంట్ మధ్య వున్న ఆసక్తికరమైన మనసుకు హత్తుకునే సన్నివేశాలతో ఎంతోమంది చిన్నారులకు ప్రేరణ కలిగించేలా రూపొందించబడినది. ఇందులో భాగంగా ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా అనాధ పిల్లకోసం అన్నపూర్ణ స్టూడియో ప్రివ్యూ థియేటర్ లో వేయడం జరిగింది.
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ శ్రీమతి సమంత అక్కినేని గారు తన అభినందనలు తెలియచేశారు. డైరెక్టర్ వీరశంకర్ గారు , అలాగే నిర్మాత శ్రీ రాజ్ కందుకూరి గారు ,దర్శకులు మధుర శ్రీధర్ గారు , సంగీత దర్శకులు రఘు కుంచె గారు , యువ హీరో అభిజిత్ , యువ దర్శకులు సాగర్ చంద్ర , యువ నటి సీత నారాయణ్, మరియు ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని చూసి ప్రశంసించడం జరిగింది.