బోయ‌పాటి కావాల‌నే లేట్ చేస్తున్నాడా?

  • IndiaGlitz, [Monday,October 22 2018]

రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో ఓసినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి విన‌య విధేయ రామ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. అయితే ఈ సినిమాను అనుకున్నంత స్పీడుగా తెర‌కెక్కించ‌డం లేద‌ట ద‌ర్శ‌కుడు బోయ‌పాటి.

ఇంకా ముప్పై రోజుల‌కు పైగా షూటింగ్ డేట్స్ పెండింగ్‌లో ఉన్నాయ‌ట‌. మ‌రో వైపు చ‌ర‌ణ్ కోసం రాజ‌మౌళి ఎదురుచూస్తున్నాడు. మ‌ధ్య‌లో డేట్స్ ఎలా అడ్జ‌స్ట్ చేస్తార‌నేది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింద‌ట‌. నిజానికి ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 11న విడుద‌ల చేసేలా ప్లాన్స్ చేసుకున్నారు.

అయితే ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్‌' కూడా జ‌న‌వ‌రిలో విడుద‌ల‌కు సిద్ధమ‌వుతుంది కాబ‌ట్టే.. బోయ‌పాటి కావాల‌నే ఈ సినిమాను ఆల‌స్యం చేస్తున్నాడ‌ని మెగా క్యాంప్‌లో వార్త‌లు వ‌స్తున్నాయట‌. అదీ గాక ఈ చిత్రానికి ఇంకా పాట‌లు ఇంకా రెడీ కాలేదు. వాటిని ఎప్పుడూ పూర్తి చేయ‌బోతున్నాడో కూడా క్లారిటీ రావ‌డం లేదు. మ‌రి దీనిపై మెగా కాంపౌండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.