'బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌'... నాలుగు గోడ‌ల మ‌ధ్య కూర్చుని రాసిన క‌థ కాదు!

  • IndiaGlitz, [Saturday,September 29 2018]

ఎవ‌రో న‌లుగురు ర‌చ‌యిత‌లు నాలుగు గోడ‌ల మ‌ధ్య కూర్చుని నాలుగు రోజుల్లో రాసిన క‌థ కాదు ఇది . మ‌న నాలుగు దిక్కులా ఎల్ల‌వేళ‌లా జ‌రుగుతున్న నిజం. ఆ వాస్త‌వాల‌ను క‌థ‌గా మ‌ల‌చి మేం 'బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌'ను తెర‌కెక్కించాం అని అంటున్నారు గోపీ గ‌ణేష్ ప‌ట్టాభి.

ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం 'బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌'. శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కులు. అభిషేక్ ఫిలిమ్స్ అధినేత ర‌మేష్ పిళ్లై నిర్మాత. తమిళంలో ఘనవిజయం సాధించిన 'చ‌తురంగ వేట్టై'ని ఆధారంగా చేసుకుని తెలుగులో 'బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌' రూపొందింది. 'జ్యోతిల‌క్ష్మి', 'ఘాజి' చిత్రాల ఫేమ్ స‌త్య‌దేవ్ హీరోగా నటించారు .'ఎక్క‌డికి పోతావు చిన్నవాడా' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కులకు దగ్గరైన నందితా శ్వేత ఇందులో నాయిక‌.

ద‌ర్శ‌కుడు గోపీ గ‌ణేష్ ప‌ట్టాభి మాట్లాడుతూ కొంద‌రు క‌ర‌క్కాయ‌లు అని, ఇంకొంద‌రు ఇరిడియం అని, మ‌రి కొంద‌రు ఎం.ఎల్‌.ఎం అని... నిత్యం మోస‌పుచ్చ‌డానికి ప్ర‌య‌త్నిస్తూనే ఉంటారు. వారి మాయ‌మాట‌లను నిజ‌మ‌ని న‌మ్మ‌డం.. మోస‌పోవ‌డం.. తీరా మోస‌పోయాక‌.. 'మోస‌పోయాన్రా' అని న‌లుగురికి చెప్పుకోవ‌డం... ఈ స‌మాజంలో ఫ్యాష‌నైపోయింది. అందుకే దాన్నే క‌థా వ‌స్తువుగా తీసుకుని, ప్రతిరూపంగా సినిమాగా తెర‌కెక్కించాం. ఇందులో ఘ‌రానా మోస‌గాడుగా స‌త్య‌దేవ్ త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల అభినంద‌న‌లు పొంద‌డానికి త‌న శ‌క్తిమేర ప్ర‌య‌త్నించాడు అని అన్నారు.

చిత్ర నిర్మాత ర‌మేష్ పిళ్లై మాట్లాడుతూ సినిమా చాలా బాగా వచ్చింది . షూటింగ్ మొత్తం పూర్త‌యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అక్టోబ‌ర్‌లో పాట‌ల‌ను విడుద‌ల చేస్తాం. న‌వంబ‌ర్‌లో చిత్రాన్నిప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం అని అన్నారు.

More News

రాజకీయ దిగ్గజం డాక్టర్ కొణిజేటి రోశయ్య విడుదల చేసిన 'టు ఫ్రెండ్స్' థియేట్రికల్ ట్రైలర్

ఆనంతలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై.. ముళ్లగూరు లక్ష్మీదేవి సమర్పణలో.. ముళ్లగూరు ఆనంతరాముడు-ముళ్లగూరు రమేష్ నాయుడు తెలుగు-కన్నడ భాషల్లో సంయుక్తంగా నిర్మించిన

ఎంజాయ్ చేస్తున్నానంటున్న శ్ర‌ద్ధాక‌పూర్!!

ప్ర‌స్తుతం బ్యాడ్మింట‌న్ స్టార్ సైనా నెహ్వాల్ పాత్ర‌లో ఒదిగిపోయిన ముద్దుగుమ్మ శ్ర‌ద్ధాక‌పూర్.. ఆ పాత్ర‌ను చాలా బాగా ఎంజాయ్ చేస్తుందట.

పూజా కోరికను తీర్చెదెవ‌రు?

ప్ర‌స్తుతం అగ్ర క‌థానాయ‌కుల‌తో న‌టిస్తున్న అమ్మడు పూజా హెగ్డే. ఎన్టీఆర్‌తో ఈమె న‌టించిన 'అర‌వింద స‌మేత' అక్టోబ‌ర్ 11న విడుద‌ల కానుంది.

మ‌ళ్లీ అంత బ‌డ్జెట్ అవ‌స‌ర‌మా?

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ..అల్లుడు శీను, స్పీడున్నోడు, సాక్ష్యం సినిమాలు భారీ బ‌డ్జెట్‌ల‌తో తెర‌కెక్కించారు. బాక్సాఫీస్ వ‌ద్ద అన్నీ ఘోరంగా ప్లాప్ అయిన‌వే.

త‌మిళ రీమేక్‌లో నాని?

విజ‌య్ సేతుప‌తి, త్రిష జంట‌గా న‌టించిన చిత్రం '96'. వింద్ మీన‌న్ సంగీత సార‌థ్యంలో ఇటీవ‌ల విడులైన ట్రైల‌ర్‌లోని బ్యాగ్రౌండ్ స్కోర్‌కి, పాట‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.