సైరా కోసం బన్ని...
Send us your feedback to audioarticles@vaarta.com
చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రమిది. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన తొలి యోధుడు ఓ తెలుగువాడు.. ఆయనే ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి. ఆయన జీవిత చరిత్రనే 'సైరా నరసింహారెడ్డి'గా తెరకెక్కిస్తున్నారు.
అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, కిచ్చా సుదీప్, నయనతార వంటి భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. కాగా ఈ చిత్రంలో మెగా ఫ్యామిలీ నుండి నిహారిక ఓ చిన్న పాత్రలో నటిస్తుంది. అలాగే రామ్చరణ్ ఎలాగూ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రానికి మరో స్టార్ వేల్యూ యాడ్ అయ్యింది. ఆ స్టార్ ఎవరో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ చిత్రానికి బన్ని తన వాయిస్ ఓవర్ అందిస్తున్నాడని సమాచారం. సురేందర్ రెడ్డి తెరెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments