'కొరియర్ బాయ్ కళ్యాణ్' మూవీ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
బ్యానర్- ఎ గురు ఫిలింస్ ప్రొడక్షన్, మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి.
నటీనటులు- నితిన్, యామీ గౌతమ్, హర్షవర్ధన్, సురేఖావాణి, అశోతోష్ రాణా, రవిప్రకాష్, సత్యం రాజేష్ తదితరులు
మ్యూజిక్- కార్తీక్, అనూప్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్- సందీప్ చౌతా
కెమెరా-సత్య పొన్ మార్
ఎడిటింగ్- ప్రవీణ్ పూడి
నిర్మాత- గౌతమ్ వాసుదేవ్ మీనన్
దర్శకత్వం- ప్రేమ్ సాయి
నితిన్ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఓ సినిమా కోసం మూడేళ్ళు పనిచేశాడు. అదే కొరియర్ బాయ్ కళ్యాణ్. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ చిత్రానికి సమర్పకుడు. సునీత తాటి, వెంకట్ సోమసుందరం, నిర్మాతలుగా ఈచిత్రాన్ని నిర్మించారు. ప్రేమ్ సాయి అనే కొత్త డైరెక్టర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని డిఫరెంట్ పాయింట్ తో సినిమా ఉంటుందని ముందు నుండి దర్శక నిర్మాతలు, హీరో చెప్పుకుంటూ వచ్చారు. మరి అలాంటి డిఫరెంట్ పాయింట్ ఏముందో తెలియాలంటే సినిమా కథలోకి వెళదాం.
కథ-
కళ్యాణ్(నితిన్) అక్క(సురేఖావాణి), బావ(హర్షవర్ధన్)లతో కలిసి ఉంటాడు. గాంధీ జయంతి రోజు తన స్నేహితుడు(సత్యం రాజేష్) కొరియర్ కవర్ ను ఖాదీ భాండార్ లో ఇవ్వడానికి వెళ్ళి అక్కడ కావ్య(యామీ గౌతమ్)ని చూసి ప్రేమిస్తాడు. ఆమె ప్రేమ పొందడానికి కొరియర్ బాయ్ గా అవతారం ఎత్తుతాడు. ప్రతిరోజు కొరియర్ వచ్చిందనే సాకుతో కావ్యను కలిసే ప్రయత్నం చేస్తుంటాడు. ఇదిలా ఉండగా సిటీలో హాస్పిటల్స్ లో గర్భవతులైన మహిళలకు ఎక్కువగా అబార్షన్స్ జరుగుతుంటాయి. దానికి కారణమైన వారి సమాచారాన్ని మాణిక్యం అనే హాస్పిటల్ అటెండర్ కనిపెడతాడు. దాని కారణమైన వారి వివరాలను సోషల్ యాక్టివిస్ట్ సత్యమూర్తి(నాజర్)కి కొరియర్ లో పంపుతాడు. అయితే ఆ కవర్ ను కొన్ని కారణాలు వల్ల కళ్యాణ్ సత్యమూర్తిగారి దగ్గరకి తీసుకెళతాడు. అప్పుడేం జరుగుతుంది? దాని వల్ల కళ్యాణ్ కి ఏ నిజం తెలిసింది? అసలు ఆ కవర్ లో ఏముంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
సమీక్ష-
నితిన్ ఈ సినిమాని తన ఇమేజ్ పక్కన పెట్టి చేశాడు. ఫుల్ ఎనర్జీతో నటించాడు. బాయ్ నెక్స్ ట్ డోర్ అనేలా చక్కగా నటించాడు. ముఖ్యంగా ఎక్కడా హీరోయిజం అనేది కనపడదు. చాలా సింపుల్ గా ఉండే కుర్రాడిలా కనపించాడు. లవర్ బోయ్ లా చక్కని నటను ప్రదర్శించాడు. ప్రేమ్ సాయి చెప్పాలనుకున్న పాయింట్ చాలా బావుంది. అయితే దాని చుట్టూ అల్లుకున్న కథ నీరసంగా ఉంది. లవ్ ట్రాక్ ఇరికించినట్టు ఉంది. ఫస్టాఫ అంతా స్లో పేస్ లో నడుస్తుంది. సెకండాఫ్ లో సినిమా ఫాస్ట్ గా నడిచినా సినిమా ఎండింగ్ ఎంటో తెలిసిపోతుంది. సినిమా నిడివి మరి తక్కువగా ఉంది. మరి అంత తక్కువ టైమ్ లో చెప్పాలనుకున్న విషయాన్ని తిప్పి తిప్పి చెప్పినట్టు కనపడింది. సత్య పొన్ మార్ సినిమాటోగ్రఫీ బావుంది. కార్తీక్, అనూప్ అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంది. మాయ ఓ మాయ, వాలుకళ్ల పిల్ల సాంగ్స్ ఆకట్టుకున్నాయి. సందీప్ చౌతా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్దగా బాలేదు. ప్రవీణ్ పూడి తన వీలైనంత మేర సినిమాని ఎడిట్ చేసేశాడు. కాబట్టి ఈ విషయంలో తనని తప్పు పట్టడానికి ఏం లేదు.
విశ్లేషణ-
చెప్పాలనుకున్న పాయింట్ కొత్తగానే ఉంది. కాదనలేం. అయితే ఈ సినిమాకి మూడేళ్ళ సమయం నిర్మాణ జాప్యం వల్ల జరిగిందా, మరేదైనా రీజనో ఏంటో కానీ సినిమా చూసినప్పుడు దీనికి ఇంత సమయం అవసరమా అనిపిస్తుంది. ప్రేమ్ సాయి అనుకున్న పాయింట్ ను డెప్త్ లేకుండా కథను అల్లుకున్నాడు. స్క్రీన్ ప్లే చాలా వీక్ గా ఉంది. లవ్ ట్రాక్, కామెడి పార్ట్ అశించిన రేంజ్ లో లేదు. సత్యం రాజేష్ కామెడి అక్కడక్కడా నవ్వించినా సినిమా అంతా థ్రిల్లింగ్ కాన్సెప్ట్ కాబట్టే కామెడి పార్ట్ తగ్గిపోయిన భావన వచ్చింది. సందీప్ చౌతా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్దగా బాలేదు. సినిమాటోగ్రఫీ, కార్తీక్, అనూప్ మ్యూజిక్ లు సపోర్టివ్ గానే ఉన్నా సినిమా విజయానికి దోహదం చేయలేవు.
బాటమ్ లైన్-
గౌతమ్ మీనన్ లాంటి స్టార్ డైరెక్టర్ పర్యవేక్షణ, మంచి టెక్నిషియన్స్ ఉన్న సినిమాగా విడుదలైన కొరియర్ బాయ్ కళ్యాణ్` మొత్తం మీద డల్ అయ్యాడు.
రేటింగ్-2.5/5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments