'చిత్రం భళారే విచిత్రం' మూవీ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
నటీనటులు - చాందిని, మనోజ్ నందం, అనీల్ కళ్యాణ్, తమిళరసన్, సుభాషిణి, సూర్య తదితరులు
సంగీతం - కనకేష్ రాథోడ్
కెమెరా - టి.సురేందర్ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - రాము వీరవల్లి
బ్యానర్ - కార్తీక్ డ్రీమ్ క్రియేషన్స్
నిర్మాత – పి.ఉమాకాంత్
రచన-దర్శకత్వం – భానుప్రకాష్ బలుసు
ప్రస్తుతం హర్రర్ కామెడి చిత్రాలకు మంచి ట్రెండ్ కొనసాగుతుంది. ఆ ట్రెండ్ ను ఫాలో అవుతూ వచ్చిన సినిమాలు మంచి ఆదరణ కూడా పొందాయి. దాంతో ప్రయోగం దర్శకుడు భాను ప్రకాస్ బలుసు చేసిన హర్రర్ కామెడి చిత్రమే చిత్రం భళారే విచిత్రం. గతంలో నరేష్ నటించిన సక్సెస్ ఫుల్ చిత్ర టైటిల్ పెట్టడం ఓ రకంగా ప్లస్ అయినా ఇందులో హర్రర్ కామెడి ప్రేక్షకులను ఆకట్టకుందా లేదా అని తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం...
కథ
శివ(మనోజ్ నందం), మదన్(అనీల్ కళ్యాణ్) చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు. శివకు నత్తి, అయినా తనకు హీరో కావాలనుంటుంది. మదన్ కూడా శివను ఎంకరేజ్ చేస్తుంటాడు. మదన్ వారి ఫామ్ హౌస్ కోర్టు కేసులో వారికే దక్కుతుంది. చిత్రదర అనే ఫామ్ హౌస్ ను సినిమా వాళ్ళకి రెంట్ కు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంటాడు మదన్. అయితే శివ కోరిక మేర తన స్నేహితుడు శివను హీరోగా పెట్టి సినిమా చేస్తే వారికి ఆ ఫామ్ హౌస్ ఫ్రీగా ఇస్తానంటాడు. అలాంటి తరుణంలో ఓ చిన్న ప్రొడ్యూసర్ తన యూనిట్ తో కలిసి శివను హీరోగా పెట్టి దారి తప్పిన దెయ్యం అనే సినిమాను తీయాలనుకుంటాడు. అప్పుడు వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? నిజంగానే ఫాంహౌస్ లో దెయ్యం ఉందా? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
సమీక్ష
మనోజ్ నందం, అనీల్ కళ్యాణ్ లు నటన పరంగా బాగానే చేశారు. మనోజ్ నందం ఎన్టీఆర్ యమదొంగలో డైలాగ్ ను ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. చాందిని దెయ్యం పట్టిన హీరోయిన్ లా చేసిన నటన బావుంది. కథలోని పాత్రలే కామెడిని తెప్పించేలా దర్శకుడు రాసుకున్న కథ బాగానే ఉంది. ఓవర్ గా భయపెట్టకపోయినా కామెడిని సినిమా నేపథ్యంలో చిత్రీకరించిన తీరు బాగానే ఉంది. అయితే సురేందర్ రెడ్డి కెమెరా పనితనం అంత ఎఫెక్టివ్ గా లేదు. లైటింగ్ విషయంలో కొన్ని సీన్స్ బాగా డల్ గా కనపడతాయి. కనకేష్ రాథోడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. కొన్ని అనవర సీన్స్ తో భయపెట్టాలనుకున్నారు కానీ అలాంటి సీన్స్ ను తీసేస్తే బావుండేది.
విశ్లేషణ
సినిమా టెక్నికల్ గా కొత్త పుంతలు తొక్కుతున్న ఇలాంటి రోజుల్లో సినిమాటోగ్రఫీ బాగా లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్ అయింది. కథలో కేవలం ఐదవు పాత్రలతో సినిమా తీయాలని చెప్పడం విడ్డూరంగా అనిపిస్తుంది. హర్రర్ కామెడి చిత్రాలతో భయపెట్టడం, నవ్వించడం కాదు. ప్రజెంటేషన్ విషయంలో కేర్ తీసుకుంటే సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతాయి.
బాటమ్ లైన్: భళారే విచిత్రం అనిపించేంత చిత్రమక్కడ లేదు మరి...
రేటింగ్: 2/5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments